మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసానికి వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ను పోలీసులు జూపూడి వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అనుమతి లేదని చెప్పడంతో అవినాశ్ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. దీంతో అవినాశ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.