కొండపల్లిలో జరిగిన బీసీ ఆత్మీయ సభలో ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇందిరా ప్రియదర్శిని, మంత్రి జోగి రమేష్‌పై తీవ్రంగా మండిపడ్డారు. జైలుకు వెళ్లి వచ్చినా జోగి రమేష్ బుద్ధి మారలేదని, చంద్రబాబు ఇంటిపై దాడి చేసినప్పుడు కుటుంబం గుర్తు రాలేదా అని విమర్శించారు. జోగి రమేష్‌ది నలుగురు కుటుంబం అయినా, వేల మందిని తీసుకువచ్చి దాడి చేశారని, బీసీల ద్రోహిగా మిగిలిపోయాడని ఇందిరా ప్రియదర్శిని ఆరోపించారు.