ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై టీడీపీ నేతలు రాళ్లు విసరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడిని అడ్డుకునే క్రమంలో కొందరు పోలీసులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి, వైసీపీ, టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టడంతో శాంతి నెలకొంది.