మైలవరంలోని వివిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ సొంగా సరళ కుమారి అధ్యక్షతన సంక్రాంతి, వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రంగారావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సందేశమిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే, 10 మంది నిరుపేద విద్యార్థులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున నగదు సహాయం అందించారు.