గుడివాడలో
వైసీపీ సభకు వెళ్తున్న జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక వాహనంపై దాడి చేయడాన్ని మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ, మహిళా ప్రజాప్రతినిధి అని చూడకుండా దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు.