మైలవరంలో న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను జనవరి 3వ తేదీ, శనివారం వరకు పొడిగించినట్లు ఏసిపి, సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ సుధాకర్, గిరిసాయి తెలిపారు. ఈ సమయంలో వాహనాల తనిఖీ కూడా కొనసాగుతుంది.