ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. తన ఇంటిపై పెట్రోల్ బాంబులతో టీడీపీ దాడి చేసిందని జోగి రమేష్ వివరించారు. ఈ దాడిని బుగ్గన తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో శత్రుత్వం సహజమే అయినా, వ్యక్తిగత దాడులు చంద్రబాబుకే సాధ్యమని ఆయన ఎద్దేవా చేశారు.