శనివారం మైలవరం మండలం పుల్లూరు శివారులోని కొత్తగూడెంలో గుర్తు తెలియని దొంగలు కలకలం సృష్టించారు. రోడ్డు పక్కన బడ్డీ కొట్టు నడుపుతున్న 62 ఏళ్ల మంగతాయారు అనే వృద్ధురాలి మెడలోంచి సుమారు రెండున్నర కాసుల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.