మైలవరం: లేబర్ కోడ్ బుక్లెట్లు విడుదల

0చూసినవారు
మైలవరం: లేబర్ కోడ్ బుక్లెట్లు విడుదల
దేశంలోని 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సీఐటీయూ నాయకులు గళమెత్తారు. శుక్రవారం మైలవరంలో భవన నిర్మాణ, ముఠా కార్మికులతో కలిసి లేబర్ కోడ్లపై రూపొందించిన బుక్లెట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త కోడ్లు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చర్యలు కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని వారు ఆరోపించారు.

ట్యాగ్స్ :