మైలవరం: మామిడిలో నష్టాలు.. పామాయిల్ సాగే దిక్కు

2033చూసినవారు
మైలవరం నియోజకవర్గంలో గత మూడేళ్లుగా రైతులు అధిక సంఖ్యలో మామిడి తోటలను తొలగిస్తున్నారు. మామిడి పంట చేతికి వచ్చే సమయంలో కాయ తొలిచే పురుగుల వల్ల అధిక నష్టాలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా, మామిడి చెట్లను నరికివేసి, ఎక్కువగా పామాయిల్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యానవన అధికారులు మామిడి పంటపై సరైన అవగాహన కల్పించకపోతే, రాబోయే రెండేళ్లలో ఈ ప్రాంతంలో మామిడి పంట కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్