మైలవరం: ఈనెల 9వ తేదీ జరుగు జాతీయ సమ్మె జయప్రదం చేయండి

69చూసినవారు
మైలవరం: ఈనెల 9వ తేదీ జరుగు జాతీయ సమ్మె జయప్రదం చేయండి
దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ జరుగుతున్న కార్మిక సమ్మె జయప్రదం చేయాలని మైలవరం మండలం చండ్రగూడెంలో భవన నిర్మాణ కార్మికులు శనివారం కరపత్రాలు పంచారు. భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి 4లేబర్ కోడ్స్ తీసుకు వచ్చిందన్నారు. దీనివల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తక్షణమే 4లేబర్ కోట్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్