మైలవరం మండలం మరుసుమల్లి గ్రామంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం బైక్ పై వెళ్తున్న గురజాల సాయి (30) అనే వ్యక్తిని టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. దీంతో క్షతగాత్రులను మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. అక్కడి నుండి విజయవాడ తీసుకెళ్లే క్రమంలో గొల్లపూడి వద్ద మృతి చెందినట్లు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.