ఆస్పిరేషనల్ బ్లాక్స్ కార్యక్రమంలో భాగంగా నీతి ఆయోగ్ బృందం శుక్రవారం ఇబ్రహీంపట్నం బ్లాక్ను సందర్శించింది. బ్లాక్లో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అమలుపై సదరు బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఎంపీడిఓ సునీత శర్మ మాట్లాడుతూ, ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ విజయవంతంగా అమలవుతోందని బ్యాంకింగ్ సేవలు గ్రామస్థులకు మరింత చేరువ అవుతున్నాయని తెలిపారు. గుంటుపల్లి సర్పంచ్ బుక్య కవిత, డిప్యూటీ ఎంపీడీఓ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.