మైలవరం మండలంలోని వెల్వడం అడ్డరోడ్డు వద్ద ఉన్న అన్న ఫిల్లింగ్ స్టేషన్ వద్ద భారీగా వాహనాలు క్యూ కట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి SI సుధాకర్ తన సిబ్బందితో కలిసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. రెవిన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో ట్రాక్టర్లకు ₹1500, లారీలకు ₹5వేల ఇంధనాన్ని నింపుతున్నారు. ప్రధాన రహదారి కావడంతో ఈ సమస్య ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.