మైలవరం: ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు.. ఆటో సీజ్ చేసిన సీఐ

7చూసినవారు
మైలవరం: ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు.. ఆటో సీజ్ చేసిన సీఐ
మైలవరం పట్టణంలో బుధవారం వాహనాల తనిఖీల్లో భాగంగా, సీఐ కిషోర్ బాబు ఒక ఆటో రిక్షాను అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు. డ్రైవర్ వద్ద చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించారు. దీనితో భారీ జరిమానా విధించారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి, అదనపు డబ్బు సంపాదించేందుకు ఇలాంటి నిర్లక్ష్య చర్యలకు పాల్పడే ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

ట్యాగ్స్ :