మైలవరం-నూజివీడు రోడ్డులోని ఓ గోల్డ్ షాప్ లో మంగళవారం జీఎస్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బంగారం లావాదేవీలు, పన్ను చెల్లింపుల్లో అవకతవకలపై ఈ తనిఖీలు జరిగినట్లు సమాచారం. అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో షాపు యజమానులు దుకాణాలకు తాళాలు వేసి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కనిపించారు. మీడియా ప్రతినిధులు రావడంతో అధికారులు సాధారణ తనిఖీలు అని చెబుతూ వెళ్లిపోవడం స్థానికుల్లో అనుమానాలకు తావిచ్చింది.