మైలవరంలో మంగళవారం జిల్లా అధికారులు, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ సమస్యలు ప్రతి సోమవారం నిర్వహించే వేదికలో పరిష్కారం కాకపోవడంతోనే జిల్లా అధికారుల వద్దకు వచ్చామని బాధితులు తెలిపారు. కళ్యాణ మండపం అర్జీలు సమర్పించేందుకు వచ్చిన వారితో కిక్కిరిసిపోయింది.