మైలవరం: పిల్లలు ఎక్కడ చదవాలి..? గ్రామస్తుల నిరసన

82చూసినవారు
మైలవరం మండలం పుల్లూరు పరిధిలో ఉన్న లక్ష్మీనరసాపురం గ్రామ ప్రజలు స్థానిక ఎంఈఓ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మా గ్రామంలో ఉన్న స్కూలు నుండి మోడల్ స్కూలు 2 కి. మీ దూరంలో ఉందని, పిల్లలు నేషనల్ హైవే మీద నుండి నడుచుకుంటూ చదువుకునేందుకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఏ మాత్రమూ ఇష్టం లేదని, కనీసం ఎంఈఓ, టీచర్లు మాకు తెలియజేయకుండా పిల్లలను అక్కడికి ఎలా పంపిస్తారంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్