హెచ్ పీసీఎల్ ను సందర్శించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం

2613చూసినవారు
హెచ్ పీసీఎల్ ను సందర్శించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం
కొండపల్లి పారిశ్రామికవాడలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌)ను ఎన్డీఆర్ఎఫ్ బృందం సోమవారం సందర్శించింది. కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్, సేఫ్టీ ఆఫీసర్‌లను కలిసి రక్షణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. 180 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆయిల్ కంపెనీలో, విశాఖపట్నం-విజయవాడకు పైపులైన్ ద్వారా వచ్చే చమురు, నిల్వచేసే ట్యాంకులు, ట్యాంకర్ల ద్వారా బంకులకు పంపే విధానాన్ని అధికారులు పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్