నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు రాము కుమారులకు సిట్, ఎక్సైజ్ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. బుధవారం విజయవాడలోని తూర్పు ఎక్సైజ్ స్టేషన్కు హాజరు కావాలని ఆదేశించారు. జోగి రమేష్ కుమారులైన రాజీవ్, రోహిత్, రాము కుమారులైన రాకేష్, రామ్మోహన్లకు వారి నివాసాల్లో నోటీసులు అందజేశారు. గతంలో అరెస్ట్ సమయంలో స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్లను తెరవాలని పోలీసులు కోరగా, అవి తమ కుమారులకు చెందినవని, పాస్వర్డ్లు వారికే తెలుసని జోగి సోదరులు తెలిపారు.