
ఇళ్ల మధ్య పడిన మిసైల్.. పరుగులు తీసిన జనం(వీడియో)
తమపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా ఆర్మీ క్యాంపులపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో కొన్ని క్షిపణులు అరబ్ దేశాల్లోని పలు ప్రాంతాల్లో పడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఖతార్‌లోని నివాస ప్రాంతంలో ఓ మిస్సైల్ పడి భారీ శబ్దంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నిరంతరాయంగా సైరన్ల మోతలు, క్షిపణుల శబ్దాలతో మిడిల్ ఈస్ట్ దేశాల ప్రజలు భయంతో జీవిస్తున్నారు.




