జి. కొండూరు మండలం ఆత్కూరులో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సోమవారం
ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. గత 23 నెలల్లో రూ. 417.36 కోట్ల పింఛన్ల సొమ్ము పంపిణీ జరిగిందని ఆయన తెలిపారు. త్వరలోనే అర్హులందరికీ నూతన పింఛన్లు మంజూరు చేస్తామని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించనున్నట్లు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అమరావతి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.