విజయవాడ: రాయనపాడులో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలో ఫిబ్రవరి నెలకు సంబంధించి 41,903 మంది లబ్ధిదారులకు రూ. 18.05 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సహాయం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అందుతుందని పేర్కొన్నారు.