రహదారి మరమ్మత్తుల కోసం ఎదురుచూస్తున్న సబ్జాపాడు ప్రజలు

1607చూసినవారు
మైలవరం నుండి సజ్జపాడు వెళ్లే రహదారి గుంతలతో నిండిపోయి ప్రమాదాలకు నిలయంగా మారింది. గత 20 ఏళ్లుగా ఈ రహదారికి మరమ్మతులు జరగలేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్