భక్తులతో ఆడుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: అల్తాఫ్ బాబా

4చూసినవారు
కొండపల్లి దర్గా విషయంలో వీటీపీఎస్ యాజమాన్యం స్పందించింది. దర్గాకు వెళ్లే రహదారిని తవ్వేసి, బ్రిడ్జిని ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఉరుసు నిర్వాహక కమిటీ సభ్యులకు, ఉరుసు ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో వీటీపీఎస్ సీఈ రామాంజనేయులు దర్గాను సందర్శించి, ఉత్సవాలకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, వీటీపీఎస్ తీరును కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా తప్పుబట్టారు. ప్రభుత్వం, ఎమ్మెల్యే, ఎంపీ ఇచ్చిన హామీ ప్రకారం ఉత్సవాల లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది భక్తుల మనోభావాలతో ఆడుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

ట్యాగ్స్ :