ఇబ్రహీంపట్నంలో హెల్మెట్ అవేర్‌నెస్పై పోలీసుల కౌన్సెలింగ్

1133చూసినవారు
ఇబ్రహీంపట్నంలో హెల్మెట్ అవేర్‌నెస్పై పోలీసుల కౌన్సెలింగ్
ఇబ్రహీంపట్నంలో పోలీసులు మంగళవారం హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ కృష్ణ ఆధ్వర్యంలో వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై కౌన్సెలింగ్ ఇచ్చారు. "హెల్మెట్ పెట్టుకుంటేనే ప్రాణ రక్షణ" అనే నినాదంతో పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యువత రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

ట్యాగ్స్ :