
ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టనున్న హిందుజా గ్రూప్
AP: లండన్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు హిందుజా గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఏపీలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. విశాఖలో హిందుజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని 1,600 మెగావాట్లు పెంచడం, రాయలసీమ విద్యుత్ ప్రాజెక్టులు, మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ యూనిట్ వంటి వాటిలో దశలవారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం, హిందుజా గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది.




