మైలవరం ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు గత 3 నెలలుగా జీతాలు చెల్లించనందుకు నిరసనగా సీఐటీయూ శుక్రవారం హాస్పిటల్ వద్ద నిరసన చేపట్టింది. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ, పండుగల సమయంలో కూడా కార్మికులకు జీతాలు నిలిపివేయడం దారుణమని, కాంట్రాక్టర్ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే శానిటేషన్ వర్కర్లకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.