సంక్రాంతి సెలవుల సందర్భంగా హైదరాబాదు నుంచి విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద భారీ వాహనాలను నగరంలోకి అనుమతించడం ట్రాఫిక్ జామ్‌కు ప్రధాన కారణమైంది. ఇబ్రహీంపట్నం పోలీసుల చొరవతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.