శ్రీరాంపురం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బడిపాటి జమలయ్య (65) అనే వృద్ధుడు మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని భార్య పదేళ్ల క్రితం మరణించగా, ఆయనకు వివాహితులైన కుమారుడు, కుమార్తె ఉన్నారు. అందరూ వివాహం చేసుకుని వేరే చోట ఉంటుండటంతో, జమలయ్య ఒంటరిగా పూరి గుడిసెలో నివసిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా పరిగణించి, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.