మొంతా తుఫాన్ ప్రభావంతో ఇబ్రహీంపట్నం మండలంలో భారీ ఈదురు గాలులు వీచాయి. నేషనల్ హైవే 65, గుంటుపల్లి రమేష్ నగర్, తుమ్మలపాలెం, జూపూడి ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణరావు వెంటనే స్పందించి, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చెట్లను తొలగించారు. వర్షాలు పడుతున్నప్పుడు వాహనదారులు రోడ్లపైకి, చెట్ల కిందకు రావద్దని ఆయన సూచించారు.