కొండపల్లి బొమ్మల ఎక్స్‌పీరియన్స్ ను సందర్శించిన కలెక్టర్..

1చూసినవారు
కొండపల్లి బొమ్మల ఎక్స్‌పీరియన్స్ ను సందర్శించిన కలెక్టర్..
జిల్లా కలెక్టర్ లక్ష్మిశ బుధవారం కొండపల్లి బొమ్మల ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించి, హస్తకళాకారులతో మాట్లాడారు. కొండపల్లి బొమ్మల ఉత్సవం విజయవంతం కావడంతో కళాకారులు కొత్త డిజైన్లతో ముందుకు రావడం అభినందనీయమని ఆమె ప్రశంసించారు. సంప్రదాయ కళకు ఆధునికతను జోడిస్తూ, మార్కెట్ విస్తరణకు ప్రభుత్వం అవసరమైన సహాయం అందిస్తుందని, కొండపల్లి బొమ్మలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు.