మైలవరంలో పెట్రోల్ కొరత లేదని MRO అబ్దుల్ ధరియా స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో అందరికీ పెట్రోల్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని, డీజిల్ కూడా అదనంగా నిల్వ ఉండేలా చూస్తామని తెలిపారు. క్యూలైన్ పద్ధతిలో పెట్రోల్, డీజిల్ పోయించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కీయ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు, సమస్యలుంటే 91549 70454 నంబర్లో తెలియజేయాలని కోరారు.