ఈవీఎం గోదాముకు పటిష్ఠ భద్రత: కలెక్టర్

0చూసినవారు
ఈవీఎం గోదాముకు పటిష్ఠ భద్రత: కలెక్టర్
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును కలెక్టర్ డా. జి. లక్ష్మీశా సోమవారం నిశితంగా తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాల ప్రకారం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, త్రీ-టైర్ భద్రతను ఆయన పరిశీలించారు. గోదాము వద్ద సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో డీఆర్వోతో పాటు వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్