తోలుకోడు: మంటలను అదుపులోకి తెచ్చిన రైతులు

1975చూసినవారు
మైలవరం మండలం తోలుకోడులోని పంట పొలాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు 25 ఎకరాల్లోని ఎండు రొట్టను తగలబెట్టే క్రమంలో మంటలు అదుపుతప్పి భారీగా ఎగసిపడ్డాయని స్థానికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సూచనల మేరకు, రైతులు ట్యాంకర్ల సహాయంతో 4 ఎకరాల్లోని చేతికి వచ్చిన మొక్కజొన్న పంటను కాపాడుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్