మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో అధికారులు వినూత్న అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో అతి తక్కువ ఖర్చుతో పారిశుద్ధ్యాన్ని నివారించేందుకు మ్యాజిక్ డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో గ్రామంలో పారిశుద్ధ్య లోపం సంభవించింది. దీంతో ఎన్. ఆర్. జి. ఎస్ నిధులతో నాపరాయి, లావుపాటి కంకరతో వినూత్న డ్రైనేజీలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇవి ఎలా ఉపయోగపడతాయో తెలియాల్సి ఉంది.