అకాల వర్షం నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. నూర్పిడి చేసి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, వ్యవసాయ, పౌరసరఫరా అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి రైతులకు గోనె సంచులు, పట్టాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అధికారుల అలసత్వంతో రైతులకు నష్టం జరగకూడదని స్పష్టం చేశారు.