సిల్ట్ తొలగింపు అక్రమాల పై విజిలెన్స్ విచారణ చేయాలి: వైసిపి

10చూసినవారు
కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైన్లలో సిల్ట్ తొలగింపులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విజిలెన్స్ విచారణ జరపాలని వైసీపీ పక్ష నేత గుంజ శ్రీను డిమాండ్ చేశారు. అధికార పార్టీ వైస్ చైర్మన్ అక్రమాలపై చేసిన ఆరోపణలు మీడియాలో కూడా ప్రచారమయ్యాయని, వాస్తవమెంతో మున్సిపాలిటీ పాలక వర్గం తెలియజేయాలని ఆయన కోరారు. ఒక అధికారి ఇంచార్జ్ గా ఉన్నప్పుడే ఈ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోందని, కొన్ని పనుల్లోనూ అవినీతి ఆరోపణలు వస్తున్నాయని శ్రీను పేర్కొన్నారు. అయితే, మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు అక్రమాలు జరగలేదని, ఆరోపణల్లో వాస్తవం లేదని, ఏ విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్