ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలకు కృషి చేస్తున్నాం..

10చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలకు కృషి చేస్తున్నాం..
కొండపల్లి ZP బాలికోన్నత పాఠశాలలో భోజనశాల నిర్మాణానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. APHMEL సంస్థ CSR నిధుల కింద ₹22.50 లక్షల వ్యయంతో ఈ నిర్మాణం జరుగుతుంది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కొండపల్లి బాలికల హైస్కూలు, కుంటముక్కల BR అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.