మాజీ మంత్రి జోగి రమేష్ ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలవడం అసాధ్యమని రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య అన్నారు. మైలవరంలోని శాసనసభ్యుని కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీలో అవినీతిని చూసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారని, నియోజకవర్గ ప్రజలు ఆయనను 43 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని తెలిపారు. జోగి రమేష్ అవినీతికి మారుపేరని ఆయన ఆరోపించారు.