నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన రావు ఆరోపించారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, దీనిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారే భగ్నం చేశారని ఆయన పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన కూటమి నేతల పాపాలకు పరిహారంగా, వైసిపి పార్టీ ఆధ్వర్యంలో శనివారం నందిగామ మండలం పల్లగిరి గట్టుపై ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.