నందిగామ ఆర్యవైశ్య సంఘం గురువారం పంచ్ ప్రభాకర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దేశంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, దానధర్మాలు, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వారి పాత్ర కీలకమని సంఘ నాయకులు పేర్కొన్నారు. అలాంటి సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటం దుర్మార్గమని మండిపడుతూ, ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.