ఎన్టీఆర్ జిల్లాలో నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ ఎస్ఐ అభిమన్యును వీరులపాడుకు, వీరులపాడు అనిల్‌ను సూర్యారావుపేటకు, రెడ్డిగూడెం మోహన్రావును నందిగామకు బదిలీ చేశారు. వీఆర్లో ఉన్న దుర్గా మహేశ్వరరావును మాచవరం ఎస్సైగా పోస్టింగ్ ఇస్తూ జారీ చేసిన ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు.