శనివారం నందిగామ పట్టణం 20వ వార్డు పరిధిలోని అనాసాగరం గ్రామంలో రూ. 15 లక్షల 20 వేల వ్యయంతో సీఆర్‌డీఏ నిధుల ద్వారా నిర్మించిన నూతన వీవీ డ్రైన్, హెచ్‌డీపీఈ పైప్‌లైన్ మరియు సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారితో కలిసి పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆమె తెలిపారు.