కంచికచర్ల: వాడీవేడిగా మండల సర్వసభ్య సమావేశం!

0చూసినవారు
కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ మలక్ బషీర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుపై సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. పలు కీలక అభివృద్ధి పనులకు సంబంధించి తీర్మానాలను ఆమోదించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎంపీపీ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్