చిల్లకల్లు 132KV-నందిగామ విద్యుత్ ఫీడర్ లో అత్యవసర మరమ్మతుల నేపథ్యంలో, శనివారం నందిగామ, చందర్లపాడు, వీరులపాడు, కంచికచర్ల మండలాల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ రవికుమార్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కరెంట్ కోత కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.