నందిగామ మండలం చందాపురంలో శ్రీరామనవమి అన్నదాన కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. ప్రసాదం స్వీకరించిన సుమారు 50మంది భక్తులు ఫుడ్ పాయిజన్ బారినపడి వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. బాధితులను నందిగామలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, కలెక్టర్ దర్యాప్తు చేపట్టారు. వంట సరకుల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపినట్లు సమాచారం.