నందిగామ కోర్టు ప్రాంగణంలో సోమవారం లోక్ అదాలత్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ నెల 14న జరగనున్న లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని, పెండింగ్ కేసులను రాజీ మార్గంలో త్వరగా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. లోక్ అదాలత్లో కుదిరిన రాజీకి తక్షణ చట్టబద్ధత లభిస్తుందని, తద్వారా సమయం, ధనం ఆదా అవుతాయని వివరించారు.