ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 24వ తానా సభల్లో బుధవారం నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విదేశాల్లోని యువత తమ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో 2013లో ప్రారంభమైన తానా సంస్థ గత 12 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు.