చందర్లపాడు మండలం తుర్లపాడులో బుధవారం బడే హజరత్ తిరునాళ్లు ఘనంగా జరిగాయి. కంచికచర్ల మండలం పెండ్యాల నుంచి సుమారు 700 జతల ఎడ్లబండ్లతో ముస్లిం కుటుంబాలు దర్గాకు చేరుకుని సంప్రదాయబద్ధంగా ఈ పండుగను జరుపుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో, నందిగామ రూరల్ సీఐ చవాన్ ఆధ్వర్యంలో శాంతిభద్రతలను పటిష్టంగా నిర్వహించడానికి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.